సమ్మె విరమించిన మునిసిపల్ కార్మికులు | Municipal workers strike call off | Sakshi
Sakshi News home page

సమ్మె విరమించిన మునిసిపల్ కార్మికులు

Oct 23 2013 6:38 PM | Updated on Oct 16 2018 7:36 PM

మున్సిపల్ పారిశుధ్య కార్మికులు సమ్మె విరమించారు.

హైదరాబాద్: రాష్ట్రా వ్యాప్తంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, జీహెచ్ ఎంసి పారిశుధ్య కార్మికులు సమ్మె విరమించారు. ప్రభుత్వ కార్యదర్శి అదర్ సిన్హాతో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాంతో  సమ్మె విరమించడానికి వారు అంగీకరించారు.

ఇదిలా ఉండగా,  జీహెచ్‌ఎంసీ కార్మికులు సమ్మె విరమించడానికి అంగీకరించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ చెప్పారు. కార్మిక సంఘాల డిమాండ్లను పరిష్కరిస్తామన్నారు. వారి డిమాండ్  మేరకు కొత్త వాహనాల కొనుగోలుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement