దివ్యాంగుల రిజర్వేషన్లను ఐదు శాతానికి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
దివ్యాంగుల బిల్లుపై చర్చలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దివ్యాంగుల రిజర్వేషన్లను ఐదు శాతానికి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాజ్యసభలో దివ్యాంగుల హక్కుల బిల్లు–2014పై జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ వైఎస్సార్‌సీపీ తరఫున బిల్లుకు మద్దతు తెలిపారు. వాస్తవానికి 2014లో ప్రవేశపెట్టిన అసలు బిల్లులో దివ్యాంగులకు ఐదుశాతం రిజర్వేషన్ల నిబంధన ఉందని, అయితే సవరించిన బిల్లులో రిజర్వేషన్లను 4 శాతానికి తగ్గించారన్నారు. దివ్యాంగుల కేటగిరీలను 7 నుంచి 21కి పెంచారని, అందువల్ల రిజర్వేషన్లను 5 శాతానికి పెంచాలని ఆయన అభిప్రాయపడ్డారు.