అనంతపురం జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్పై ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
అనంతపురం జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్పై ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల పేరుతో సామాన్యులను టార్గెట్ చేసుకోవడం తగదని, నేరచరిత్ర లేకున్నా కూడా కార్యకర్తలను కౌన్సెలింగ్ పేరుతో వేధిస్తున్నారని ఆయన అన్నారు.
కౌన్సెలింగ్ పేరుచెప్పి కొంతమంది కార్యకర్తలపై అవసరం లేకున్నా థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కూడా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎస్పీ సెంథిల్ కుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలని అనంత వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు.