శ్రీదేవికి ఎంపీ మేకపాటి ఆర్థికసాయం | MP Mekapati Financiel help to sridevi | Sakshi
Sakshi News home page

శ్రీదేవికి ఎంపీ మేకపాటి ఆర్థికసాయం

Mar 1 2018 10:17 AM | Updated on Oct 16 2018 3:40 PM

MP Mekapati Financiel help to sridevi - Sakshi

నగదు అందజేస్తున్న ఎంపీ రాజమోహన్‌రెడ్డి

నెల్లూరు(సెంట్రల్‌): నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కొండాపురం సాయిపేటకు చెందిన శ్రీదేవి అనే మహిళకు రూ.15,000 ఆర్థికసాయాన్ని అందజేశారు. బుధవారం నెల్లూరులోని తన నివాసంలో ఆమెకు నగదు అందజేశారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ శ్రీదేవి విద్యుత్‌ ప్రమాదంలో కుడిచేతిని పోగొట్టుకుందన్నారు.

ఆమె భర్త కల్యాణ్‌ ఇద్దరు పిల్లలను, ఆమెను వదిలి వెళ్లిపోయిన విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. జన్మభూమి కమిటీల నిర్వాకం వల్ల ఆమెకు పింఛన్‌ రాలేదన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి విభిన్న ప్రతిభావంతుల కోటా కింద పింఛన్‌ మంజూరు చేయాలని కోరానన్నారు. జెడ్పీచైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, కొండాపురం మాజీ మండలాధ్యక్షుడు యల్లాపు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement