వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారు | Mother, uncle Prostitution profession work | Sakshi
Sakshi News home page

వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారు

May 8 2018 8:15 AM | Updated on May 8 2018 8:17 AM

Mother, uncle Prostitution profession work - Sakshi

బుచ్చిరెడ్డిపాళెం: తనను తల్లి, మేనమామలు వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారని, తట్టుకోలేక బంధువుల ఇంటికి వచ్చానని నందా గౌతమి(26) అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆమె విలేకరులతో మాట్లాడారు. తనకు మేనమామ మూర్తి(36)తో వివాహమైందని, తన తల్లి ఈశ్వరమ్మ తనను వ్యభిచారం చేయాలని బలవంతం చేస్తోందని వాపోయింది. దీంతో బుచ్చిరెడ్డిపాళెంలో మామ వరుసైన పరంధామయ్య ఇంటికి వచ్చానన్నారు. అయితే తన తల్లి, మేనమామతోపాటు మరికొందరు మూడు రోజుల క్రితం బుచ్చిరెడ్డిపాళెంలోని మామ ఇంటికి వచ్చారని, అక్కడ మాటల నేపథ్యంలో తోపులాట జరిగిందని, అక్కడి నుంచి వెళ్లి దాడి చేసినట్లు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారని గౌతమి వాపోయింది. తనకు న్యాయం చేయాలని కోరింది. 

కేసు నమోదు
తన కుమార్తెను తీసుకెళ్లేందుకు వచ్చిన తనతోపాటు మరికొందరిపై పరంధామయ్య మరికొందరు దాడి చేసి గాయపరిచారని ఈశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఎస్సై ప్రసాద్‌రెడ్డిని సంప్రదించగా గాయపడిన బాధితులు ఆస్పత్రిలో చేరారని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. అనంతరం గౌతమి ఫిర్యాదు చేసిందన్నారు. దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement