వివాహేతర సంబంధంతో కొడుకు హత్య | Mother kills minor son for her lover | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధంతో కొడుకు హత్య

Jun 3 2014 12:26 PM | Updated on May 25 2018 5:49 PM

వివాహేతర సంబంధంతో కొడుకు హత్య - Sakshi

వివాహేతర సంబంధంతో కొడుకు హత్య

మూడు రోజుల క్రితం తిరుపతి సమీపంలో జరిగిన బాలుడి మురళి హత్యకేసు మిస్టరీని పోలీసులు చేధించారు.

తిరుపతి : మూడు రోజుల క్రితం తిరుపతి సమీపంలో జరిగిన బాలుడి మురళి హత్యకేసు మిస్టరీని పోలీసులు చేధించారు. బాలుడి తల్లి అరుణ, ఆటో డ్రైవర్ సోమశేఖర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమ సంబంధం కారణంగానే వారు బాలుడిని హతమార్చినట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని తిరుపతి శివారులోని ఓ హోటల్లో  విచారిస్తున్నారు. నిందితుడిని రాత్రికి మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

వివరాల్లోకి వెళితే...చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ ప్రాంతంలోని బైపాస్‌రోడ్డుకు సమీపంలో నిర్జన ప్రదేశంలో తొమ్మిదేళ్ల వయసు కలిగిన బాలుడిని పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు. ఈ సంఘటన శనివారం వెలుగుచూసింది. బాలుడు 80 శాతం కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. అయతే మెడలోని తాయత్తు, చేతిలోని కంకణం ద్వారా మృతిచెందిన బాలుడు టిటిడి చైర్మన్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేసే మునిరత్నం కుమారుడు మురళిగా పోలీసులు గుర్తించారు. అతని చొక్కా జేబులో ఉన్న చాక్లెట్ కూడా అలాగే ఉంది. గుర్తుపట్టకుండా చేసేందుకు మాత్రమే ముఖంపైన పెట్రోల్ పోసి కాల్చివేశారు.

మునిరత్నంరెడ్డి, భార్య అరుణ, కుమార్తె హేమశ్రీ(12), మురళి(9)తో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం 5గంటల సమయంలో మురళి ఆడుకుంటానని ఇంటి నుండి వెళ్లి రాత్రి పదిగంటలు అయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెదకి అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించి మూడురోజుల్లోనే మిస్టరీని చేధించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement