వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఏపీ రాష్ట్ర కమిటీ, అనుబంధ సంఘాల్లో ఆదివారం మరిన్ని నియామకాలు జరిగాయి.
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఏపీ రాష్ట్ర కమిటీ, అనుబంధ సంఘాల్లో ఆదివారం మరిన్ని నియామకాలు జరిగాయి. పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ఈ కింది వారిని ఆయా పదవుల్లో నియమించినట్లు పేర్కొన్నారు.
పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా మహ్మద్ గౌస్ బేగ్(అనంతపురం-అర్బన్), కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి(సూళ్లూరుపేట-నెల్లూరు), సంయుక్త కార్యదర్శులుగా దేవరకొండ రమాభాస్కర్, అన్నపరెడ్డి హర్షవర్థన్‌రెడ్డి(తాడికొండ-గుంటూరు), ఇందూరు నర్సింహారెడ్డి(ఆత్మకూరు-నెల్లూరు), ఎం.పి.సురేష్(వైఎస్సార్‌జిల్లా),దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి(తిరుపతి), రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా గబ్బల వెంకటేశ్(అనంతపురం అర్బన్), రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా ఎం.వి.సందీప్‌రెడ్డి(గుంతకల్), రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా డి.మహేష్(గుంతకల్), రాష్ట్ర వైఎస్సార్ సేవాదళ్ కార్యదర్శిగా త్యాగరాజు(గుంతకల్), బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్.ప్రవీణ్‌యాదవ్(గుంతకల్), రైతు విభాగం కార్యదర్శిగా ఎం.నాగిరెడ్డి(గుంతకల్), మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఎం.అన్సర్‌వలి(గుంతకల్), రాష్ట్ర ఎస్సీ విభాగం కార్యదర్శిగా కె.మల్లికార్జున(గుంతకల్), రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా కె.శ్రీదేవి(అనంతపురం), రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ ప్రధాన కార్యదర్శిగా వేణుంబాక విజయశేఖర్‌రెడ్డి(సూళ్లూరుపేట), విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఎం.రమేష్‌రెడ్డి(తంబళ్లపల్లి) నియమితులయ్యారు.