ఓ హిందువుగా ఆవేదన చెందాను: మోహన్బాబు | Mohan Babu agony as a Hindu | Sakshi
Sakshi News home page

ఓ హిందువుగా ఆవేదన చెందాను: మోహన్బాబు

Jun 24 2014 7:23 PM | Updated on Sep 2 2017 9:20 AM

మోహన్‌బాబు

మోహన్‌బాబు

షిర్డీ సాయిబాబాపై ద్వారక శంకరాచార్య స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యలను ప్రముఖ నిర్మాత, నటుడు మోహన్‌బాబు ఖండించారు.

హైదరాబాద్: షిర్డీ సాయిబాబాపై  ద్వారక శంకరాచార్య స్వరూపానంద సరస్వతి  వ్యాఖ్యలను ప్రముఖ నిర్మాత, నటుడు  మోహన్‌బాబు ఖండించారు. షిరిడిసాయి దేవుడు కాదంటే బాధగా ఉందన్నారు. ఓ హిందువుగా ఆవేదన చెందానని చెప్పారు. కొంతమంది మతిచలించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈశ్వరుడి అంశ సాయిబాబా అని  మోహన్‌బాబు పేర్కొన్నారు.

షిర్డీ సాయిబాబు దేవుడు కాదని, మనిషిని దేవుడిగా పూజించవద్దంటూ ద్వారక శంకరాచార్య స్వరూపానంద సరస్వతి  వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా షిర్డీసాయి దేవుడు కాడని, ఆయనకు ఆలయాలు కట్టడం సరికాదని ఆయన అన్నారు.  హిందువులను విభజించేందుకే అంతర్జాతీయ శక్తులు బాబాను సీన్లోకి తెచ్చాయని స్వరూపనంద చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement