మీ అందరికీ తోడుగా ఉంటా

MLA RK Roja New House Warming In Nagari Chittoor - Sakshi

నగరిలో నూతన గృహ ప్రవేశం చేసిన ఎమ్మెల్యే ఆర్‌కే రోజా

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని భరోసా

చిత్తూరు, విజయపురం: ‘ మీ ఇంటి బిడ్డగా, ఆడపడుచుగా, సోదరిగా ఆదరించి గెలిపించారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోను ? ఎప్పటికీ మీ వెంటే ఉంటా. మీ కష్టాలను తీర్చే ప్రతినిధిని అవుతా. నిత్యం అందుబాటులో ఉండాలనే నగరిలో ఇల్లు కట్టుకున్నా’ అని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నా రు. గురువారం నగరి పట్టణం సమీపంలోని మం డపం వద్ద నూతన గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.

పార్టీలకతీతంగా నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే రోజా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, నారాయణస్వామి, దేశాయ్‌ తిప్పారెడ్డి, సునీల్‌కుమార్, మాజీ మంత్రి చెంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top