‘ఆ ఘనత ఆయనకే దక్కుతుంది’

MLA Ravindranath Reddy Opens New YSRTC Mazdoor Union New Office In Gajuwaka - Sakshi

ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి

సాక్షి, విశాఖపట్నం: ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేరుస్తున్నారని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన గాజువాకలో వైఎస్‌ఆర్‌టీసీ మజ్దూర్‌ యూనియన్ స్టీల్‌ సిటీ డిపోలో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు.

పేద విద్యార్థుల అభివృద్ధే ధ్యేయంగా సీఎం జగన్‌ పనిచేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడానికి ఇంగ్లీష్‌ బోధనను ప్రవేశపెట్టారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే నాలుగు లక్షలు ఉద్యోగాలు కల్పించిన ఘనత  ముఖ్యమంత్రికే  దక్కుతుందన్నారు. పేద,బడుగు బలహీన వర్గాలు ఆనందంగా ఉండేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌టీసీని మరింత బలోపేతం చేయాలని కార్మికులకు రవీంద్రనాథ్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top