అదృశ్యమైన బాలికలు దొరికారు | missing girls found at kukatpally | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన బాలికలు దొరికారు

May 20 2015 6:13 PM | Updated on Aug 21 2018 4:18 PM

వారం రోజుల క్రితం గుంటూరులో అదృశ్యమైన ముగ్గురు బాలికలు లేఖారెడ్డి, దివ్య, యశస్వి సురక్షితంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్: వారం రోజుల క్రితం గుంటూరులో అదృశ్యమైన ముగ్గురు బాలికలు లేఖారెడ్డి, దివ్య, యశస్వి సురక్షితంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కూకట్ పల్లిలో వీరి ఆచూకీ కనుగొన్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వీరి జాడ గుర్తించారు. స్నేహతురాలి పెళ్లి కోసం వీరు ఇంట్లో చెప్పకుండా ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది. తల్లిదండ్రులకు అప్పగించేందుకు గుంటూరు పోలీస్ స్టేషన్ కు వీరిని తీసుకెళ్లారు.

ఈనెల 14న అదృశ్యవడంతో గుంటూరు అర్బన్  పోలీసు స్టేషన్ లో బాలికల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తమ పిల్లలు సురక్షితంగా ఉన్నారని తెలియడంతో బాలికల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement