
లక్ష్మీపురం: నేపాల్‌కు చెందిన బాలిక అదృశ్యమైన ఘటనపై అరండల్‌పేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్ దేశానికి చెందిన గోవింద్ తాప అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు వలస వెళ్లి అక్కడ హోటల్‌లో పని చేసుకుంటున్నాడు. అయితే ఇటీవల రెండు నెలల క్రితం గోవింద్ తాప కుమార్తె సరిత కుమారి మరి కొంత మందితో కలిసి గుంటూరుకు వచ్చి, గుంటూరులోని రైల్వే కోచ్ రెస్టారెంట్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది.
అయితే ఈనెల 14వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాలేదు. విషయం తెలుసుకున్న తండ్రి గోవింద్ తాప గుంటూరు వచ్చి చుట్టు పక్కల ప్రాంతాలలో, బంధుమిత్రుల వద్ద ఎంత వెతుకులాడినా ఆచూకీ తెలియక పోవడంతో దిక్కు తోచక అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు అరండల్‌పేట పోలీసు స్టేషన్ 0863–2231955, సీఐ ఆరోగ్య రాజు 8688831332, ఎస్‌ఐ రోజాలత, 8688831334, నంబర్లకు సమాచారం తెలియజేయాల్సిందిగా సూచించారు.