లోకేశ్‌ టీచర్‌కు జీతం ఎంతో తెలుసా? | Minister Lokesh specially appointed teacher For Telugu Pronunciation | Sakshi
Sakshi News home page

లోకేశ్‌ టీచర్‌కు జీతం ఎంతో తెలుసా?

Apr 12 2018 6:03 PM | Updated on Aug 18 2018 8:05 PM

Minister Lokesh specially appointed teacher For Telugu Pronunciation - Sakshi

నారా లోకేశ్‌, పెద్ది రామారావు

సాక్షి, అమరావతి: ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు తెలుగులో ఎలా మాట్లాడాలో తగిన శిక్షణ ఇవ్వడంతో పాటు పాఠాలు నేర్పుతున్న పెద్ది రామారావుకు ప్రభుత్వం భారీ నజరానా ఇచ్చింది. లోకేశ్‌ ప్రసంగాలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు మార్పులు సూచించే ఆయనను గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా మండలి సభ్యుడిగా నియమించింది. ఆయనకు నెలకు రూ. లక్ష వేతనం, హెచ్‌ఆర్‌ఏ కింద రూ.35 వేలు, అలాగే ప్రభుత్వ సలహాదారుతో సమానంగా ఇతర అలవెన్సులన్నీ వర్తింపజేయాలంటూ బుధవారం ప్రణాళికా శాఖ కార్యదర్శి సంజయ్‌గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆయనకు ఒక ప్రైవేట్‌ కార్యదర్శిని, ఒక ప్రైవేట్‌ అసిస్టెంట్‌ను, ఇద్దరు ఆఫీస్‌ సబార్డినేట్స్‌ను కూడా ఇవ్వనున్నట్లు జీవోలో స్పష్టం చేశారు. 

గురువు నేపథ్యం
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి ఫైన్‌ ఆర్ట్స్‌ లో పీహెచ్‌డీ చేసిన పెద్ది రామారావు తెలుగు నాటక రచయితగా గుర్తింపు పొందారు. బుల్లితెరలో ప్రసారమైన రుతురాగాలు సీరియల్‌కు ఆయన మాటలు రాశారు. తర్వాత థియేటర్ ఆర్ట్స్‌కి సంబంధించి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. మరీ ముఖ్యంగా 2009 ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన జూనియర్‌ ఎన్టీఆర్‌కు కూడా పెద్ది రామారావే శిక్షకుడిగా వ్యవహరించారు. నటుడు రాజీవ్‌ కనకాలకు రామారావు బావ అవుతారు. కొన్నేళ్లుగా రామారావు, లోకేశ్‌కు సన్నిహితంగా ఉంటూ.. తెలుగు ప్రసంగాలకు సంబంధించిన సలహాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ది రామారావును తెలుగు శిక్షకుడిగా లోకేశ్‌ నియమించుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement