‘డైనమిక్‌ విధానంతో ప్రజలకు లాభం’

Mekathoti Sucharitha Talk On Current Bill In Guntur District - Sakshi

సాక్షి, గుంటూరు: పవర్‌ కార్పొరేషన్‌ నిబంధనల ప్రకారమే కరెంట్‌ రీడింగ్‌ తీస్తున్నామనిహోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కరెంట్‌ బిల్లులు అధికంగా వస్తున్నాయనేది అపోహ అని తెలిపారు. ఏప్రిల్‌ నెల బిల్లులను డైనమిక్‌ విధానం ద్వారా తీస్తున్నామని ఆమె తెలిపారు. డైనమిక్‌ విధానం ప్రకారం ఎంత విద్యుత్‌ను వినియోగించుకున్నారో అంతే బిల్లు వస్తుందని ఆమె వివరించాచరు.

స్లాబ్‌ విధానం కాకుండా డైనమిక్‌ విధానంతో ప్రజలకు లాభమని మంత్రి సుచరిత తెలిపారు. ఇక లాక్‌డౌన్‌ వల్ల విద్యుత్‌ వినియోగం అధికంగా పెరిగిందని ఆమె చెప్పారు. జూన్‌ 30వ తేదీ నాటికి ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా బిల్లులు చెల్లించవచ్చని హోం మంత్రి సుచరిత అన్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top