27 నుంచి మెడికల్ కౌన్సెలింగ్! | medical counselling to start from 27th | Sakshi
Sakshi News home page

27 నుంచి మెడికల్ కౌన్సెలింగ్!

Aug 22 2014 3:35 AM | Updated on Sep 2 2017 12:14 PM

ఈనెల 27 నుంచి మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులు నిర్ణయానికొచ్చారు.

సాక్షి, హైదరాబాద్: ఈనెల 27 నుంచి మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులు నిర్ణయానికొచ్చారు. దీని కోసం శుక్రవారం నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలిసింది. ఇరు రాష్ట్రాలకు చెందిన కొంతమంది అధికారులు గురువారం సచివాలయంలో సమావేశమయ్యారు. అయితే దీనికి ఇరు రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులు అందుబాటులో లేరు. అందువల్ల శుక్రవారం మళ్లీ సమావేశమైన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది.  కాగా, బీ కేటగిరీ సీట్లకు పాతఫీజులే ఉంటాయని అధికారులు చెబుతున్నా, శుక్రవారం తుదినిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement