అర్ధ వేతనపు సెలవును నగదుగా మార్చుకోవచ్చు

వైఎస్‌ఆర్‌ జిల్లా  , ప్రొద్దుటూరు : త్వరలో అర్ధ వేతనపు సెలవును నగదుగా మార్చుకునే ఉత్తర్వు 148పై మార్గదర్శకాలు విడుదల కానున్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎస్‌ ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్‌ ఉత్తర్వుల సాధనకే పరిమితం కాక, సీపీఎస్‌ రద్దు కోసం పోరాటం చేస్తామన్నారు. అలాగే 10 నెలల పీఆర్సీ బకాయిలు, రెండు విడుతల డీఏ, పీఆర్సీ జీఓతోపాటు 11వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు.

మున్సిపల్‌ ఉపాధ్యాయుల పదోన్నతుల సమస్యను పరిష్కరింప చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.రఘునాథరెడ్డి, రాష్ట్ర బా«ధ్యుడు రషీద్‌ఖాన్, జిల్లా నాయకులు కొత్తపల్లె శ్రీను, బాలగంగిరెడ్డి, మునెయ్య, జయరామయ్య, కేవీ రమణ, ఎ.సుకుమార్, ఎ.శ్రీనివాసులు, కె.నరసింహారెడ్డి, సలీం, మండల బాధ్యులు మోజెస్‌ రవి, శ్రీనివాసులు, సంజీవరెడ్డి, తిరుమలకొండయ్య పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top