విశాఖ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. రామన్న అనే గిరిజన యువకుడిని హతమార్చారు.
విశాఖపట్నం: జిల్లాలోని మంచంగిపుట్ట మండలం గొబ్రపడలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. రామన్న అనే గిరిజన యువకుడిని హతమార్చారు. మృతదేహం తమ ఆధీనంలోనే ఉందంటూ గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. దీంతో గిరిజన గూడెంలో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి.
తమ కదలికలపై పోలీసులకు సమాచారం అందిస్తున్నాడనే నెపంతో రామన్నను మావోయిస్టులు శనివారం కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. రామన్నను నిర్బంధించే క్రమంలో నాలుగు ఇళ్లను కూడా పేల్చేశారు. మావోయిస్టుల దుశ్చర్యను ఖండించిన విశాఖ జిల్లా పోలీసులు.. తమకు సహకరిస్తున్నాడనే నెపంతో అమాయక గిరిజనుణ్ని పొట్టనపెట్టుకున్నారన్నారు.