ఎరక్కపోయి... ఇరుక్కుపోయి!

Material Transport Boat Strucked InRiver Guntur - Sakshi

నదిలో ఇరుక్కుపోయిన జలరవాణా పంటు

ఆందోళనకు గురైన వాహనదారులు

ఇబ్రహీంపట్నం: రాజధాని అమరావతి నిర్మాణానికి జలమార్గం ద్వారా మెటీరియల్‌ రవాణా చేస్తున్న పంటు ఇబ్రహీంపట్నం ఫెర్రీ లాంచీ రేవు సమీపంలో నదిలో ఒడ్డుకు పట్టి ఇరుక్కుపోయిం ది. శుక్రవారం సాయంత్రం 6.30గంటల సమయంలో 15 లారీలు (600 టన్నులు) ఎక్కించుకుని ఫెర్రీ వైపు నుంచి లింగాయపాలెంకు బయలుదేరింది. బయలు దేరిన కొద్దిసేపటికే  నదిలో ఏర్పాటు చేసుకున్న మార్గంలో పక్కకు రావటంతో  ఒడ్డుకు పట్టి కదలకుండా నిలిచిపోయింది.  ఈపరిణామాలతో పంటుపైన ఉన్న వాహనదారులు ఆందోళనకు గురయ్యారు.

ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిని ఎదుర్కొన్నారు. పంటు ఒడు ్డకు పట్టి నిలిచిపోయిందనే విషయాన్ని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఒడ్డుకు పట్టిన పం టును పక్కకు జరిపే ప్రయత్నాలు సిబ్బంది చేపట్టారు. సంగమం ప్రాంతంలో వరుస సంఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో పంటుకు ప్రమాదం ఏర్పడిందనే సమాచారం మండలంలో దావానంలా వ్యాపించింది. అయితే ఆలస్యంగా అసలు విషయాన్ని తెలుసుకుని ప్రజలు ఊపిరి  పీల్చుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top