పది రోజుల్లో స్వదేశానికి మస్తాన్‌బాబు మృతదేహం | Sakshi
Sakshi News home page

పది రోజుల్లో స్వదేశానికి మస్తాన్‌బాబు మృతదేహం

Published Sun, Apr 5 2015 10:23 PM

పది రోజుల్లో స్వదేశానికి మస్తాన్‌బాబు మృతదేహం - Sakshi

సంగం (నెల్లూరు): పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మృతదేహాన్ని పది రోజుల్లో భారత్‌కు పంపేలా చర్యలు తీసుకుంటామని చిలీలోని భారతీయ ఎంబసీ అధికారులు సమాచారం అందించినట్టు మృతుడి సోదరి దొరసానమ్మ ఆదివారం మీడియాకు తెలిపారు.

 

చిలీలో ప్రతికూల వాతావరణం ఉండడంతో జాప్యం జరుగుతోందన్నారు. అయితే మృతదేహాన్ని వారంలోగా పంపేలా చూడాలని తాను భారత ఎంబసీని కోరినట్లు ఆమె చెప్పారు. గతనెల 24 నుంచి ఆచూకీ తెలియని మస్తాన్‌బాబు మృతదేహాన్ని శనివారం తెల్లవారుజామున గుర్తించారు. 172 రోజుల్లో ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తై పర్వత శిఖరాలను అధిరోహించి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్న మస్తాన్ ఆ పర్వతాల్లోనే ఒదిగిపోయారు. గత ఏడాది డిసెంబర్ 16న ఇంటి నుంచి బయలుదేరిన అతడు దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ దేశాల మధ్యనున్న ఆండీస్ పర్వతారోహణకు సిద్ధపడి ప్రాణాలు కోల్పోయాడు.

Advertisement
Advertisement