కిరోసిన్ పోసుకుని వివాహిత ఆత్మహత్య | Married woman committed suicide with kerosene | Sakshi
Sakshi News home page

కిరోసిన్ పోసుకుని వివాహిత ఆత్మహత్య

Nov 21 2013 4:51 AM | Updated on Nov 6 2018 7:53 PM

నందిపేట మండ లం వెల్మల్ గ్రామానికి చెందిన వివాహిత కొట్టూర్ భాగ్య(22) మంగళవారం రాత్రి ఒంటి పై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడి ంది.

నందిపేట, న్యూస్‌లైన్: నందిపేట మండ లం వెల్మల్ గ్రామానికి చెందిన వివాహిత కొట్టూర్ భాగ్య(22) మంగళవారం రాత్రి ఒంటి పై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడి ంది. ఎస్సై విజయ్‌కుమార్  వివరాల ప్రకా రం... నిజామాబాద్ మండలం కులాస్‌పూర్ గ్రామానికి చెందిన భాగ్యను వెల్మల్ గ్రామానికి చెందిన కొట్టూర్ దేవేందర్‌తో ఆరే ళ్ల కిత్రం ఇచ్చి పెళ్లిచేశారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు నవకాంత్ ఉన్నాడు. అదనపు కట్నం తేవాలంటూ దేవేందర్  రెండేళ్లుగా భార్యను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. కులపెద్దలు పలుమార్లు చెప్పినా మార్పురాలేదు. దీంతో జీవితంపై విరక్తిచెందిన భాగ్య మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. వెంటనే ఇరుగు పొరుగువారు తులపులు పగలగొట్టి భాగ్యను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందింది. బుధవారం ఉదయం తహశీల్దార్ శ్రీధర్ ఆస్పత్రిలో శవపంచనామా నిర్వహించారు. మృతురాలి తల్లి శ్రీరాం లక్ష్మీ  ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement