వివాహిత ఆత్మహత్యాయత్నం | married woman committed suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్యాయత్నం

Sep 11 2015 1:32 AM | Updated on Sep 3 2017 9:08 AM

పిఠాపురం మండలం పి.దొంతమూరుకు చెందిన వివాహిత వాసంశెట్టి కృష్ణవేణి గురువారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు పిఠాపురం

పిఠాపురం రూరల్ : పిఠాపురం మండలం పి.దొంతమూరుకు చెందిన వివాహిత వాసంశెట్టి కృష్ణవేణి గురువారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు పిఠాపురం రూర ల్ పోలీసులు తెలిపారు. దొంతమూరుకి చెందిన వాసంశెట్టి లోవరాజుతో కృష్ణవేణికి పదేళ్ల కిందట పెళ్లయింది. ఇటీవల అదనపు కట్నం కోసం భార్యను లోవరాజు వేధించడం ప్రారంభించాడు. ఇటీవల పుట్టింటికి వె ళ్లిన కృష్ణవేణి అదనపు కట్నం తీసుకురాకపోవడంతో ఆమెను శారీకరంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడు. దీంతో మనస్తాపానికి గురైన కృష్ణవేణి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై వి.సుభాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement