మీనా ఎన్‌కౌంటర్‌.. స్పందించిన మావోలు | Sakshi
Sakshi News home page

వారిని విడుదల చేయాలి: మావోలు

Published Mon, Oct 15 2018 4:34 PM

Maoists Release Audio Tape Over Meena Encounter - Sakshi

సాక్షి, విశాఖపట్నం:  ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)వద్ద ఈ నెల 12 జరిగిన మావోయిస్టు దళ మహిళా డిప్యూటీ కమాండర్‌ మీనా ఎన్‌కౌంటర్‌, మరి కొంత మంది అరెస్ట్‌లపై మావోయిస్టు కేంద్ర కమిటీ ఆడియో టేప్‌ విడుదల చేశారు. ఏవోబీ డివిజన్‌ కార్యదర్శి కైలాష్‌ అలియాస్‌ చలపతి పేరిట రిలీజ్‌ చేసిన ఆడియో టేప్‌లో సరిహద్దుల్లో పోలీసుల ప్రవర్తిస్తున్న తీరును తప్పుబట్టారు. ‘కామ్రేడ్‌ మీనా మృతి మావోయిస్టు పార్టీకి తీరని లోటు. ఆ లోటును భర్తీ చేసుకుంటూ అమరులైన వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. శత్రువులు ఇచ్చిన సమాచారం మేరకు గ్రే హౌండ్స్‌ పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టి ఏకదాటిగా రాపిడ్‌ ఫైరింగ్‌ చేశారు.

ఆ ఫైరింగ్‌కు తూటాలు తగిలిన మీనా తీవ్రంగా గాయపడింది. గ్రే హౌండ్స్‌ పోలీస్‌లే మీనాను హత్య చేశారు. గత వారం రోజుల నుంచి కాల్పులతో పోలీస్‌లు భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. కట్‌ ఆఫ్‌ ఏరియాలో ప్రధానంగా ఆంధ్రలో పెద బయలు, ముంచంగిపుట్టు, ఒడిశాలోని మల్కన్‌ గిర, ఆండ్రపల్లి, జంత్రీ వంటి గిరిజన గ్రామాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఆండ్రపల్లిలోని మహిళలందరినీ హింసించారు. పోలీసులు ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులను నిర్బంధించారు. వారిని బేషరతుగా విడుదల చేయాలి’అంటూ ఆడియో టేప్‌లో మావోలు కోరారు. 

చదవండి: 

‘గిడ్డి ఈశ్వరి 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది’

ఎదురుకాల్పులతో దద్దరిల్లిన ఏవోబీ

తూర్పుకొండల్లో.. మావోగన్స్‌ ఘాతుకం

Advertisement
Advertisement