‘కిడారికి పట్టిన గతే నీకూ పడుతుంది’ | Maoist Letters Threatens Gurajala MLA Yarapathineni Srinivasa Rao | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలను హెచ్చరిస్తూ వెలసిన మావోయిస్టు లేఖలు

Mar 12 2019 1:57 PM | Updated on Mar 12 2019 2:05 PM

Maoist Letters Threatens Gurajala MLA Yarapathineni Srinivasa Rao - Sakshi

సాక్షి, గుంటూరు : పల్నాడులో మరోసారి మావోయిస్టు పార్టీకి చెందిన లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. అవినీతి, భూకబ్జాదారులు తమ పద్ధతి మార్చుకోవాలని మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు. కిడారి సర్వేశ్వర రావుకు పట్టిన గతే గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావుకు పడుతుందని హెచ్చరించారు మావోయిస్టులు. యరపతినేనితో పాటు పలువురు టీడీపీ నేతలను హెచ్చరిస్తూ లేఖలు విడుదల చేశారు.

ఈ లేఖలు దాచేపల్లి మోడ్రన్ స్కూల్ దగ్గర వెలిశాయి. ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో మావోయిస్టు పార్టీకి చెందిన లేఖలు దర్శనమివ్వడం చర్చనీయంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement