నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి పలు ప్రాంతాల్లో విక్రయించిన వ్యక్తిని నందిగామ పోలీసులు అరెస్టు చేశారు. తన కార్యాలయంలో
నకిలీ సర్టిఫికెట్ల
Oct 16 2013 2:06 AM | Updated on Aug 20 2018 4:44 PM
నందిగామ న్యూస్‌లైన్ :నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి పలు ప్రాంతాల్లో విక్రయించిన వ్యక్తిని నందిగామ పోలీసులు అరెస్టు చేశారు. తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ చిన్నహుస్సేన్ ఈ వివరాలు వెల్లడించారు. నందిగామకు చెందిన విప్పర్ల్ల రంగారావు పలు యూనివర్శిటీల డిగ్రీ, పీజీ, పదో తరగతి, ఇంటర్మీడియెట్ బోర్డు నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి విక్రయిస్తుంటాడని తెలిపారు. నందిగామకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి టి.లింగయ్య ఫిర్యాదు మేరకు రంగారావుపై విచారణ జరపామన్నా రు.
ఈ సర్టిఫికెట్ల తయారీలో అతడికి పలువురు సహకరించామని తేలిందన్నారు. ఆంధ్రా యూనివర్శిటీ, బీహార్‌కు చెందిన లలిత్ నారాయణ్ మిథిలా వర్శిటీ, రాష్ట్రానికి చెందిన బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ బోర్డుల పేరుతో తయారు చేసిన నకిలీ సర్టిఫికెట్లను నిందితుని వద్ద స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో మరికొంత మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు. వీరిలో నిందితులుగా గుర్తించినవారిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. ఈ సందర్భంగా నిందితుడిని మీడియాకు చూపారు. సమావేశంలో సీఐ భాస్కరరావు, ఎస్సై రామకృష్ణ, ఐడీ పార్టీ సిబ్బంది నాగేశ్వరరావు, రామారావు, రాములు పాల్గొన్నారు.
Advertisement
Advertisement