భార‍్యను హత్యచేసి.. భర్త ఆత‍్మహత్య | man murder his wife and committed suicide | Sakshi
Sakshi News home page

భార‍్యను హత్యచేసి.. భర్త ఆత‍్మహత్య

Jan 10 2017 8:43 AM | Updated on Sep 5 2017 12:55 AM

అనుమానం పెనుభూతమై ఒక కుటుంబాన్ని కాటువేసింది. ఫలితంగా అమాయకుడైన బాలుడు అనాథగా మారాడు.

వేముల: అనుమానం పెనుభూతమై ఒక కుటుంబాన్ని కాటువేసింది. ఫలితంగా అమాయకుడైన బాలుడు అనాథగా మారాడు. ఈ విషాద ఘటన మంగళవారం తెల‍్లవారుజామున వైఎస్సార్‌ జిల్లా వేముల మండలం నల‍్లచెరువుపల్లి గ్రామంలో జరిగింది. నల‍్లచెరువుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన రామాంజనేయులు, కవిత దంపతులు కూలీపని చేసుకుని జీవించేవారు. కొంతకాలం నుంచి రామాంజనేయులు భార‍్యపై అనుమానం పెంచుకుని వేధించడం మొదలుపెట్టాడు. దాంతో కుటుంబంలో కలహాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో రామాంజనేయులు తాగుడుకు బానిసయ్యాడు. 
 
ఈ క్రమంలో తెల‍్లవారుజామున గొడ‍్డలితో భార్య కవితను నరికి దారుణంగా హతమార్చాడు. అనంతరం తాను ఉరివేసుకుని ఆత‍్మహత‍్య చేసుకున్నాడు. తల్లిదండ్రులిద‍్దరూ చనిపోవడంతో వారి ఒక‍్కగానొక‍్క కుమారుడు అనాథగా మారాడు. ఈ సంఘటన స్థానిక ఎస్సీ కాలనీలో కలకలం సృష్టించింది. సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటన స‍్థలాన‍్ని పరిశీలించారు. పంచనామా నిర‍్వహించి మృతదేహాలను పోస్టుమార‍్టం నిమిత‍్తం వేముల ప్రభుత‍్వ ఆస‍్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement