ఆస్తి కోసం ఓ వ్యక్తి పెద్దమ్మను గొంతు నులిమి హత్య చేశాడు. గుంటూరు జిల్లా పెద్దకూరపాడు మండలం గొలుసుపాడులో బక్రీద్ రోజున జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగు చూసింది.
పెద్దకూరపాడు (గుంటూరు) : ఆస్తి కోసం ఓ వ్యక్తి పెద్దమ్మను గొంతు నులిమి హత్య చేశాడు. గుంటూరు జిల్లా పెద్దకూరపాడు మండలం గొలుసుపాడులో బక్రీద్ రోజున జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగు చూసింది. ప్రాథమిక సమాచారం మేరకు.. షేక్ బాషా అనే వ్యక్తి తొలుత జాన్‌బీని పెళ్లి చేసుకోగా వారికి పిల్లలు కలగలేదు. దీంతో బాషా జాన్‌బీ చెల్లెలు మీరాబీని వివాహమాడాడు. వీరికి నాగుల్‌మీరాషా సంతానం.
కాగా బాషా మద్యానికి అలవాటై ఆస్తి కోసం పెద్దమ్మ జాన్‌బీని కొంతకాలంగా వేధిస్తున్నాడు. అందుకు ఆమె సమ్మతించకపోవడంతో బక్రీద్ రోజు మద్యం సేవించి ఆమెను హత్య చేశాడు. శవాన్ని ఇంట్లోనే ఉంచి గ్యాస్‌ట్రబుల్‌తో చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో హత్య విషయం వెలుగు చూసింది.