టీటీడీలో నకిలీ ఉద్యోగి హల్చల్ | Man held for entering Tirumala with fake Employee ID | Sakshi
Sakshi News home page

టీటీడీలో నకిలీ ఉద్యోగి హల్చల్

Jan 13 2014 10:41 PM | Updated on Aug 28 2018 5:43 PM

టీటీడీలో నకిలీ ఉద్యోగి హల్చల్ - Sakshi

టీటీడీలో నకిలీ ఉద్యోగి హల్చల్

కలియుగ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో విద్యుత్ శాఖ ఏఈ అంటూ ఓ నకిలీ ఉద్యోగి హల్చల్ చేశాడు.

తిరుమల: కలియుగ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో ఓ నకిలీ ఉద్యోగి విద్యుత్ శాఖ ఏఈ అంటూ హల్చల్ చేశాడు. శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించిన కుమార్ అనే వ్యక్తి తాను విద్యుత్ శాఖ ఏఈగా చెప్పుకుంటూ అలజడి సృష్టించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు టీటీడీ పోలీసు అధికారులు పేర్కొన్నారు.

 

అయితే గత మూడు నెలలుగా ఆలయంలో కుమార్ ఏఈగా చెప్పుకుంటూ తిరుగుతున్నట్టు పోలీసులు తెలిపారు. అతనిపై అనుమానంతో విజిలెన్స్ అధికారులు కూడా విచారిస్తున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement