సోదరిపై అన్న లైంగిక దాడికి యత్నం | Man held for attempting to rape sister at Meerpet | Sakshi
Sakshi News home page

సోదరిపై అన్న లైంగిక దాడికి యత్నం

Jan 5 2014 9:22 AM | Updated on Sep 4 2018 5:07 PM

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కిరాతకుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న పదేళ్ల సోదరిపై లైంగికదాడికి యత్నించాడు.

హైదరాబాద్: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కిరాతకుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న పదేళ్ల సోదరిపై లైంగికదాడికి యత్నించాడు. మీర్‌పేట ఎస్‌ఐ సత్యనారాయణ కథనం ప్రకారం... జిల్లెలగూడ ప్రగతినగర్‌కాలనీలో అక్కాచెల్లెళ్లు నివాసముంటున్నారు. భర్తలు లేని వీరు కూలీపని చేసుకుంటూ జీవిస్తున్నారు. అక్కకు యాదగిరి (25) కుమారుడు, చెల్లెలకు పదేళ్ల కుమార్తె ఉంది.

రెండు రోజుల క్రితం అక్కాచెల్లెళ్లు బయటకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న యాదగిరి సోదరిపై లైంగికదాడికి యత్నించాడు. చిన్నారి ప్రతిఘటించి బయటకు పరుగుతీసింది. అప్పటి నుంచి స్కూల్ మానేసి ఇంట్లోనే ఏడుస్తూ కూర్చుం టోంది. దీంతో తల్లి నిలదీయగా జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో శనివారం సాయంత్రం తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement