కరెంటు షాక్‌తో వ్యక్తి మృతి | man dies of vidyut shock | Sakshi
Sakshi News home page

కరెంటు షాక్‌తో వ్యక్తి మృతి

May 27 2015 5:40 PM | Updated on Apr 3 2019 8:07 PM

కరెంటు షాక్‌తో బొమ్మి శివయ్య(30) అనే వ్యక్తి మృతిచెందాడు.

వైఎస్సార్ జిల్లా: కరెంటు షాక్‌తో బొమ్మి శివయ్య(30) అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా ఓబులవారిపల్లి మండలం కమ్మతల్లి హరిజనవాడలో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామంలో శివయ్య అనే వ్యక్తి తాగునీటి మోటారు రిపేరు చేస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ తగిలింది.  దీంతో శివయ్య అక్కడిక్కడే మృతిచెందాడు. శివయ్య మృతితో ఆయన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
(ఓబులవారిపల్లి)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement