బైక్ ప్రమాదంలో వ్యక్తి మృతి | Man dies as Bike Overturns | Sakshi
Sakshi News home page

బైక్ ప్రమాదంలో వ్యక్తి మృతి

Jul 25 2015 6:36 PM | Updated on Jun 1 2018 8:36 PM

బైక్‌పై వేగంగా వెళ్తుండగా అదుపుతప్పి బోల్తాపడటంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

మడకశిర (అనంతపురం జిల్లా) : బైక్‌పై వేగంగా వెళ్తుండగా అదుపుతప్పి బోల్తాపడటంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన శనివారం అనంతపురం జిల్లా మడకశిర మండలం ఆర్. అనంతపురం గ్రామం సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని రేకులకుంట గ్రామానికి చెందిన రామాంజనేయులు(35), రమేష్(33)లు జిల్లాలో జరుగుతున్న రైతు భరోసా యాత్రలో పాల్గొనేందుకు బైక్‌పై బయలుదేరారు. వీరిద్దరు గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలుగా పని చేస్తున్నారు.

అయితే ప్రమాదవశాత్తు వీరు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి బోల్తాపడటంతో రామాంజనేయులు(35) అక్కడికక్కడే మృతి చెందగా, రమేష్(33) తీవ్రంగా గాయపడ్డాడు. రమేష్ను మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. కాగా మృతిచెందిన రామాంజనేయులు కుటుంబసభ్యులను వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి కలిసి పరామర్శించనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement