ప్రేమను నిరాకరించిదనే అక్కసుతో ఓ ఉన్మాది యువతిపై బ్లేడ్ తో దాడికి పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరించిదనే అక్కసుతో ఓ ఉన్మాది దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో నిద్రిస్తున్న యువతిని భాష అనే యువకుడు బ్లేడ్తో దాడి చేశాడు. తాడేపల్లి గూడెంలోని భాగ్యలక్ష్మిపేటలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దాడిలో గాయపడిన బాధితురాలు ప్రస్తుతం ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. గత కొంతకాలంగా భాష.... ఈ యువతిని వేధిస్తున్నట్లు సమాచారం. గతంలో ఇదే విషయంపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.