భర్త బర్త్‌ డే విషెస్ చెప్పలేదని టీచర్‌..!! | Eluru Teachers Incident, Government Teacher Mandada Devika Ends Her Life In Apartment | Sakshi
Sakshi News home page

భర్త బర్త్‌ డే విషెస్ చెప్పలేదని టీచర్‌..!!

Jul 21 2025 1:52 PM | Updated on Jul 21 2025 2:33 PM

Eluru Teachers Incident

అనుమానాస్పద మృతిగా పోలీసుల కేసు నమోదు

గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త

ఏలూరు: అనుమానాస్పద స్ధితిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మందాడ దేవిక (38) తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్యకు పాల్పడడం కలకలం సృష్టించింది. నూజివీడు సమీపంలో బత్తులవారిగూడెం గ్రామానికి చెందిన రిటైర్డ్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ మందాడ లక్ష్మయ్య, ప్రభావతి కుమార్తె దేవికను పెదపాడు మండలం నాయుడుగూడెం గ్రామానికి చెందిన చిన్ని సురేంద్రకిచ్చి 20 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వారికి పవన్‌ తేజ, గౌతమ్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

 దేవిక ఉంగుటూరు మండలం నల్లమాడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. సురేంద్ర ఉంగుటూరు మండలం రాచూరు పాఠశాలలో హెచ్‌ఎంగా ఉన్నారు. చొదిమెళ్ళ శ్రీవల్లి అపార్ట్‌మెంట్స్‌లో ఐదేళ్ల కిందట అపార్ట్‌మెంట్‌ కొన్నారు. ఉద్యోగాల నిమిత్తం ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో ఉంటున్నారు. శని, ఆదివారాలు ఏలూరు అపార్ట్‌మెంట్‌కు వెళ్తుంటారు. శనివారం సాయంత్రం 5 గంటలకు సురేంద్ర వచ్చేసరికి ఉరి వేసుకుని భార్య దేవిక మృతి చెంది ఉంది.

 మనస్తాపంతో కాళ్లు, చేతులపై అతను తీవ్రంగా కోసుకున్నాడు. దేవిక పుట్టిన రోజు సందర్భంగా కుమారులు శుభాకాంక్షలు చెప్పేందుకు తల్లిదండ్రులకు ఫోన్‌ చేశారు. వారు లిఫ్ట్‌ చేయకపోవడంతో ఏలూరులోనే ఉంటున్న పెదనాన్నకు చెప్పడంతో అతను అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా రక్తమడుగులో ఉన్న తమ్ముడు కనిపించాడు. వెంటనే పోలీసులకు, సురేంద్ర మామ లక్ష్మయ్యకు విషయం తెలియచేసి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అపార్ట్‌మెంట్‌ను పరిశీలించారు.  

మృతిపై అనుమానాలు: మృతురాలి తండ్రి 
తన కూతురు దేవిక మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతురాలు తండ్రి లక్ష్మయ్య తెలిపారు. పూర్తిస్థాయి విచారణ నిర్వహించాలని కోరారు. టీచర్‌ మృతి చెందిన అపార్ట్‌మెంట్‌లో సీసీ కెమెరాలు పనిచేయటం లేదని సిబ్బంది తెలిపారు. ఈ నేపథ్యంలో ఇద్దరి సెల్‌ఫోన్‌ డేటా కీలకం కానుంది. పుట్టినరోజు నాడే తన కుమార్తె దేవిక మృతి చెందటం తట్టుకోలేకపోతున్నానని తండ్రి లక్ష్మయ్య కన్నీటి పర్యంతమయ్యారు. చిన్న కూతురుగా గారాబంగా పెంచమని ఇలా జరుగుతుందని ఊహించలేదని అన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement