చిలకలూరిపేటలో భారీ అగ్నిప్రమాదం | Major Fire Accident in Chilakaluripet | Sakshi
Sakshi News home page

చిలకలూరిపేటలో భారీ అగ్నిప్రమాదం

Aug 7 2018 8:21 AM | Updated on Sep 5 2018 9:47 PM

Major Fire Accident in Chilakaluripet - Sakshi

చిలకలూరిపేట: గుంటూరు జిల్లా చిలకలూరిపేట లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒంటిగంట సమయం లో ఒక్కసారిగా పాత కలప దుకాణం లో మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లో పక్క షాపులకు కూడా వ్యాపించటం తో చిలకలూరి పేటలో హైటెన్షన్ నెలకొంది. మంటలు వ్యాపించిన  తొమ్మిది షాపుల్లోను  భారీగా కలప నిల్వ ఉండటం తో మంటలు ఎగసి పడ్డాయి. దీనికి తోడు గాలి కూడా తీవ్రంగా ఉండటంతో పరిస్ధితి భయంకరంగా మారింది. మంటల్ని అదుపు చేయడానికి అగ్ని మాపక సిబ్బంది అష్ట కష్టాలు పడ్డారు.

నాలుగు ఫైరింజన్లు తో పాటు స్డానికంగా ఉన్న వాటర్ ట్యాంకు తో మూడు గంటల పాటు కష్టపడితే కాని మంటలు అదుపులోకి రాలేదు. మంటల తీవ్రతకు షాపుల చుట్టు పక్కలవారు ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఈ ప్రమాదం లో దాదాపు కోటి వరకు ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ప్రమాదానికి కారణం మాత్రం ఇంకా తెలియటం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement