మూలవిరాట్ విగ్రహం ధ్వంసం | main idol collapsed | Sakshi
Sakshi News home page

మూలవిరాట్ విగ్రహం ధ్వంసం

Jan 30 2015 6:37 PM | Updated on Sep 2 2017 8:32 PM

విద్యుత్ సమస్యతో 740 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినా బాధ్యులు మీరుకారా అన్ని టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు.

నకరికల్లు(గుంటూరు): మండల కేంద్రంలోని కొండపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలోని మూలవిరాట్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గురువారం రాత్రి ఆలయ పూజారి దీపారాధన చేసి మెయిన్ గేటుకు తాళాలు వేసి వెళ్లారు. మరుసటి రోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు వచ్చి చూసేసరికి విగ్రహం ధ్వంసమై కనిపించింది.  దుండగులు కేవలం విగ్రహం మాత్రమే ధ్వంసం చేశారు తప్ప విలువైన వస్తువుల జోలికి మాత్రం పోలేదు.

 

గుప్త నిధుల కోసం ఈ పని చేసి ఉండవచ్చునని స్థానికులు అనుకుంటున్నారు. 2 సంవత్సరాల క్రితం కొండ కింద ఉన్న ఊయల పల్లకి వద్ద కూడా గుప్తనిథుల కోసం తవ్వకాలు జరగటంతో ఆ కోణంలో అనుమానాలు తలెత్తుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement