
రాజస్తాన్ ఝలవార్ జిల్లా ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకి చేరింది. మరో 15 మందికి గాయాలైనట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. వీళ్లలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు.
శుక్రవారం ఉదయం 8.30గం.ప్రాంతంలో మనోహర్ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల భవనంలోని ఓ తరగతి పైకప్పు కుప్పకూలింది. ఆ సమయంలో విద్యార్థులు క్లాస్‌లో కూర్చుని ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సాయంతో టీచర్లు శిథిలాలను తొలగించే ప్రయత్నం మొదలుపెట్టారు.

శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆస్పత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు, విద్యాశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
20 ఏళ్ల కిందటి నాటి ఈ స్కూల్ భవనానికి మరమ్మత్తులు అవసరమని గతంలో పలు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ క్రమంలో.. గత కొంతకాలంగా ఇక్కడ వర్షాలు పడుతుండడంతో ఈ ఘోరం జరిగింది. పైకప్పు రాళ్లతో కట్టి ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

ప్రమాదంపై ప్రధాని మోదీ, రాజస్తాన్ సీఎం భజనాన్ లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ జిల్లా కలెక్టర్, అధికారులతో మాట్లాడి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
सुबह-सुबह झालावाड़ से दुखद खबर
झालावाड़ में एक सरकारी स्कूल की बिल्डिंग गिरने से 5 बच्चों की मौत हो गई. वहीं हादसे में 30 से ज्यादा बच्चे गंभीर घायल हैं.
हादसा शुक्रवार सुबह प्रार्थना के दौरान मनोहरथाना ब्लॉक के पीपलोदी सरकारी स्कूल में हुआ.#Rajasthan #Jhalawar pic.twitter.com/DgtbbO8k3q— Avdhesh Pareek (@Zinda_Avdhesh) July 25, 2025