అన్నప్రసాదం అడిగితే అవమానించారు !

Mahanandi Temple Staff Insult To Devotees In Kurnool - Sakshi

అన్నదాన కేంద్రం సిబ్బంది దురుసు ప్రవర్తన

మహానంది: దేవుడి సన్నిధిలో నిర్వహిస్తున్న అన్నప్రసాదం తీసుకుంటే పుణ్యం వస్తుందనే భావనతో ప్రసాదంగా కొంచెం అన్నం పెట్టండని అడిగిన భక్తులను అవమానించిన ఘటన మహానంది క్షేత్రంలో చోటు చేసుకుంది.  హైదరాబాద్‌ ఓల్డ్‌సిటీకి చెందిన శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులు మహానందీశ్వరుడి దర్శనార్థం మహానందికి వచ్చారు. స్వామి దర్శనం అనంతరం అన్నదాన కేంద్రం వైపు వెళ్లా రు. ప్రసాదంలా ఓ ముద్ద అడిగేందుకు లోపలికి వెళ్తుండగా అక్కడి సిబ్బంది అడ్డుకుంటూ టోకెన్లు లేనివారిని అనుమతించమని, దురుసుగా ప్రవర్తిస్తూ మహిళలని సైతం చూడకుండా తోసేశారు.

ప్రసాదంలా ఓ ముద్ద పెడితే చాలని బతిమాలినా వారి పట్ల  ఆగ్రహం వ్యక్తం చేశారు. అవమానంగా భావించిన భక్తులు కంటతడిపెట్టి వెళ్లారు. ఈ విషయాన్ని ప్రత్యక్షంగా చూసిన డ్వామా ఏపీడీ రాజారావు వెంటనే ఈఓ సుబ్రహ్మణ్యంకు ఫోన్‌లో విషయం తెలపడంతో పాటు నేరుగా కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం ఈఓ సంబంధిత సిబ్బందిని పిలిపించి మందలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top