తెలంగాణ వచ్చిన వేళ తెలుగు తమ్ముళ్లు ఎటు వెళ్లాలో తెలి యక తికమకపడుతున్నారు. తమ వల్లే ప్రత్యేకతెలంగాణ ఏర్పడిందని ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాలని చూస్తున్న టీడీపీ నే తలను అపనమ్మకం ఆవహించింది.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణ వచ్చిన వేళ తెలుగు తమ్ముళ్లు ఎటు వెళ్లాలో తెలి యక తికమకపడుతున్నారు. తమ వల్లే ప్రత్యేకతెలంగాణ ఏర్పడిందని ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాలని చూస్తున్న టీడీపీ నే తలను అపనమ్మకం ఆవహించింది. పొరుగు జిల్లా రంగారెడ్డి టీ డీపీ ఎమ్మెల్యేలు వలసబాట పడుతుండటంతో జిల్లా నేతల ప్ర స్థానంపైనా అంతర్గతంగా చర్చ సాగుతోంది. ఆ జిల్లాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు ఓ ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమైంది. దీంతో మనజిల్లా నుంచి కూడా త్వరలో ఇతర పార్టీల్లోకి వలసలు ఉంటాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.
2009 ఎన్నికల్లో మహాకూటమి పేర ఎన్నికల బరిలోకి ది గిన టీడీపీ మనజిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో విజయం సా ధించింది. మహాకూటమి అభ్యర్థిగా పోటీచేసిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొం దారు.
ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్, టీడీపీ మధ్య దూరం పెరగడంతో పాటు 2009 నవంబర్ నాటి కేసీఆర్ దీక్ష పరిణామాల నే పథ్యంలో ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితి ఏర్పడింది. ఇదే సమయంలో టీడీపీ కీలక నేత నాగం జనార్దన్‌రె డ్డి టీటీడీపీ ఫోరం కమిటీ కన్వీనర్ పదవిని వదలుకుని పార్టీకి దూరమయ్యారు. ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో బీజేపీ గూటికి చేరుకున్న నాగం ప్రస్తుతం మరికొంత మంది టీడీపీ ముఖ్య నేతలను కమలం గూటికి చేర్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్‌లో ఉన్నట్లు బీజేపీ నేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.
యువనేత దూకుడుపై కినుక
జిల్లాకు చెందిన టీడీపీకి చెందిన యువనేతకు ఇటీవలి కాలంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు సమాచారం. సుదీర్ఘకాలంగా పార్టీలో కొనసాగుతున్న తమను కాదని సదరు యువనేతను ప్రోత్సహిస్తుండటంపై కొందరు అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం.
అయితే పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన ఓ ఎమ్మెల్యే మాత్రం టీడీపీలో కొనసాగడమో లేదా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవడమో చేస్తానని స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. గతంలో టీడీపీ పక్షాన మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీచేసి.. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న ఓ ముఖ్యనేత ‘తమ్ముళ్ల’తో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరి చేరికకు సంకేతాలు ఇచ్చినందున, మీరూ నిర్ణయం తీసుకోండి..అంటూ సదరు నేత ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. అయితే ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారో తెలియని స్థితిలో తెలుగు తమ్ముళ్లు ఎదుటి వారి కదలికలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో టీడీపీ ముఖ్య నేతలు తీసుకునే నిర్ణయాలపై సొంత పార్టీతో పాటు రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.