పాపం చేసి ఉంటేనే పూజలకు వస్తారు: ఎమ్మెస్సార్ | M Satyanarayana Rao Rahu Ketu Pooja in Srikalahasti | Sakshi
Sakshi News home page

పాపం చేసి ఉంటేనే పూజలకు వస్తారు: ఎమ్మెస్సార్

Dec 20 2013 3:46 PM | Updated on Sep 2 2017 1:48 AM

పాపం చేసి ఉంటేనే పూజలకు వస్తారు: ఎమ్మెస్సార్

పాపం చేసి ఉంటేనే పూజలకు వస్తారు: ఎమ్మెస్సార్

పాపం చేసినవాళ్లు విముక్తి కోసం శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చేయించుకుంటారని, తాను ఏదో పాపం చేసి ఉంటేనే పూజల కోసం వచ్చానని ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణ రావు అన్నారు.

శ్రీకాళహస్తి: పాపం చేసినవాళ్లు విముక్తి కోసం శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చేయించుకుంటారని, తాను ఏదో పాపం చేసి ఉంటేనే పూజల కోసం వచ్చానని ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణ రావు అన్నారు. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయానికి గురువారం ఆయన కుటుంబ సమేతంగా విచ్చేశారు. రూ.2500ల రాహుకేతు పూజలు చేయించుకున్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

అనంతరం ఎమ్మెస్సార్ ఆలయ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ పాపం చేసిన వారికి శివయ్య తన చెంత రాహుకేతు పూజలు చేయించుకుని విముక్తి కలిగిస్తాడని, తనకా అదృష్టం ఇప్పడు లభించిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement