కోస్తాకు వాయుగుండం.. అల్లకల్లోలంగా సముద్రం | Low Pressure Over Bay Of Bengal Bring Rainfall To Coastal Andhra | Sakshi
Sakshi News home page

Dec 12 2018 6:51 PM | Updated on Dec 12 2018 7:02 PM

Low Pressure Over Bay Of Bengal Bring Rainfall To Coastal Andhra - Sakshi

సాక్షి, అమరావతి: కోస్తా ఆంధ్రకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్ప పీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ ప్రభావంతో డిసెంబర్‌ 14 నుంచి 16 మధ్య కాలంలో కోస్తా జిల్లాల్లో భారీ వర్షం కురవనుందని తెలిపారు. సుమద్రంలో అలలు 6 మీటర్ల ఎత్తు వరకు ఎగసి పడే అవకాశం ఉందన్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. గంటకు 70 నుంచి 100 మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement