విశాఖలో ఘరానా దోపిడి | Looted cigarette container worth Rs 6 crores in vizag | Sakshi
Sakshi News home page

విశాఖలో ఘరానా దోపిడి

Nov 20 2016 6:24 PM | Updated on Aug 28 2018 7:30 PM

విశాఖలో ఘరానా దోపిడి - Sakshi

విశాఖలో ఘరానా దోపిడి

విశాఖలో సిగరెట్ల లోడుతో వెళ్తున్న ఓ కంటైనర్‌ను దుండగులు లూటీ చేశారు.

అనకాపల్లి : విశాఖ జిల్లాలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. సబ్బవరం మండలం దేవీపురం వద్ద శనివారం రాత్రి సిగరెట్ల లోడుతో వెళ్తున్న ఓ కంటైనర్‌ను దుండగులు లూటీ చేశారు. ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హౌరా నుంచి సిగరెట్ లోడ్తో ఉన్న కంటైనర్ హైదరాబాద్ బయల్దేరింది. విశాఖ సబ్బవరం సమీపంలో కంటైనర్ను ఆపిన దొంగలు రూ.6 కోట్ల విలువైన సిగరెట్లను మరో లారీలోకి నింపుకున్నారు. అనంతరం డ్రైవర్‌ను కొట్టి కశింకోట మండలం ఏఎస్‌పేట వద్ద వదిలేశారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు సబ్బవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement