స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి | Local institutions should be strengthened | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి

Oct 18 2014 3:06 AM | Updated on Sep 2 2017 3:00 PM

స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి

స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి

తోటపల్లిగూడూరు: స్థానిక సంస్థలైన మండల పరిషత్, పంచాయతీల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.

ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

 తోటపల్లిగూడూరు: స్థానిక సంస్థలైన మండల పరిషత్, పంచాయతీల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం  పాపిరెడ్డిపాళెం, తోటపల్లిగూడూరు పంచాయతీల్లో జరిగిన జన్మభూమి-మా ఊరు గ్రామ సభల్లో కాకాణి మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే స్థానిక సంస్థలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇసుక రీచ్‌ల ఆదాయంలో పొదుపు సంఘాలకు  కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ఇది వరకు ప్రకటించిందన్నారు.

అయితే 25 శా తం ఆదాయాన్ని రుణమాఫీ కోసం వినియోగిస్తామననడం దుర్మార్గపు చర్య అన్నారు. ఇసుక రీచ్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని 25శాతం  పొదు పు సంఘాల అభివృద్ధికి పోను మిగిలిన మొత్తాన్ని స్థానిక సంస్థలకు వినియోగించాలన్నారు. జన్మభూమి కార్యక్రమం అర్థం లేకుండా సాగుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాల్లో మౌలివసతుల కల్పనకు ఏ మాత్రం కృషి చేయ కుండా బడి పిలుస్తోంది అంటూ మొక్కుబడి కార్యక్రమాన్ని చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించకుండా, సిబ్బందిని నియమించకుండా స్వచ్ఛాంధ్ర పేరుతో గ్రామాల్లో పారి శుధ్య కార్యక్రమాలను చేపట్టడం ఎలా సాధ్యమో పాలకులే తెలపాలన్నారు.

పేదలకు భద్రత కల్పిస్తున్నామంటూనే లేని పోని సాకులు చూపి అధికారులు వేలాది మంది పింఛన్లు తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిం చారు. అనంతరం అర్హులైన వారికి ఎమ్మెల్యే పింఛన్లను పంపిణీచేశారు. తొలుత ఎమ్మెల్యే కాకాణికి ఎంపీటీసీ సభ్యుడు దద్దోలు వెంకటకృష్ణయ్య ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు.

శ్రీశైలం ఆలయ చైర్మన్ ఆల్తూరు ఆదినారాయణరెడ్డి, ఎంపీడీఓ సావిత్రమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు మన్నెం చిరంజీవులగౌడ్, సర్పంచ్‌లు మన్నెం నీలిమ, మచ్చా మాధవయ్య, ఎంపీటీసీ సభ్యుడు దద్దోలు వెంకటకృష్ణయ్య, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ టంగుటూరు పద్మనాభరెడ్డి, నాయకులు నాయుడు హేమంత్‌రెడ్డి, తోడేటి సుధాకర్, నెల్లూరు లక్ష్మణ్, మేనాటి రామయ్య, పెళ్లూరుశ్రీరాములు, అన్నం హరి బాబు, మన్నెం సుబ్రహ్మణ్యం, మన్నెం రాము, పాకం ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement