వైఎస్సార్సీపీ జెండా ఎగరేద్దాం | local body elections in kurnool | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ జెండా ఎగరేద్దాం

Mar 16 2014 12:48 AM | Updated on May 29 2018 4:09 PM

వైఎస్సార్సీపీ జెండా ఎగరేద్దాం - Sakshi

వైఎస్సార్సీపీ జెండా ఎగరేద్దాం

మునిసిపల్, స్థానిక, సాధారణ ఎన్నికల్లో వైఎసార్సీపీ అభ్యర్థులను గెలిపించి పార్టీ జెండాను ఎగురవేద్దామని కార్యకర్తలకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి పిలుపునిచ్చారు.

కర్నూలు(ఓల్డ్‌సిటీ), న్యూస్‌లైన్: మునిసిపల్, స్థానిక, సాధారణ ఎన్నికల్లో వైఎసార్సీపీ అభ్యర్థులను గెలిపించి పార్టీ జెండాను ఎగురవేద్దామని కార్యకర్తలకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి పిలుపునిచ్చారు. కల్లూరులో విఠల్‌నగర్, ముజఫర్‌నగర్, రాజీవ్‌నగర్, అలాగే కృష్ణానగర్‌కు చెందిన 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం గౌరువెంకటరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
 
ఈ సందర్భంగా గౌరు మాట్లాడుతూ.. కల్లూరు మండలంలో వైఎస్సార్‌సీపీ అభివృద్ధికి అందరూ తోడ్పడాలని కోరారు. పాణ్యం నియోజకవర్గంలో ఈసారి వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడేలా చేయాలన్నారు. కార్యక్రమంలో దేవదాసు, శేషన్న, గోవర్దన్, నాగన్న(సీఎస్‌ఐ చర్చి సభ్యులు)లతో పాటు రామ్మోహన్‌రెడ్డి మిత్రబృందం, గౌరు యువసేన అధ్యక్షుడు ప్రసాద్, శేఖర్, షేక్షా, చెన్నయ్య, అరుణ్, నాగన్న, నగేష్, పెద్దనాగన్న, పార్థు, శ్రీనివాస్, మోహనాచారి, ఆర్కెస్ట్రా శ్రీను, చిన్ననాగన్న పాల్గొన్నారు.  
 
 వైఎస్‌ఆర్‌సీపీలోకి  బలపనూరువాసులు
 
 కల్లూరు: పాణ్యం మండలం బలపనూరు గ్రామానికి చెందిన 30 కుటుంబాలవారు   శనివారం స్థానిక మాధవీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో గౌరు దంపతుల సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరిలోతిమ్మదాసు, ప్రభుదాసు తదితరులున్నారు. కార్యక్రమం లో ప్రకాశం, కాంతారావు, హజరయ్య, రవీం ద్రనాథ్,రంగనాథ్,వెంకటాద్రి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement