తినే ఆహారంలో బల్లి ప్రత్యక్షం కావడంతో విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. శనివా రం యైటింక్లయిన్‌కాలనీలోని ట్రాన్సిస్ట్ గెస్ట్‌హౌజ్‌లో గల జేఎన్‌టీయూ హాస్టల్‌లో విద్యార్థినులు భోజనం చేస్తుండగా అందు లో బల్లి కనిపించింది. దీంతో వారు భయపడి అన్నాన్ని పడేశారు.
యైటింక్లయిన్‌కాలనీ, న్యూస్‌లైన్: తినే ఆ హారంలో బల్లి ప్రత్యక్షం కావడంతో విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. శనివా రం యైటింక్లయిన్‌కాలనీలోని ట్రాన్సిస్ట్ గెస్ట్‌హౌజ్‌లో గల జేఎన్‌టీయూ హాస్టల్‌లో విద్యార్థినులు భోజనం చేస్తుండగా అందు లో బల్లి కనిపించింది. దీంతో వారు భయపడి అన్నాన్ని పడేశారు. మంథని జేఎన్‌టీ యూ విద్యార్థినులకు ప్రతి రోజూ ఆటో ద్వారా ఎన్టీపీసీ జేఎన్‌టీయూ బాయ్స్ హా స్టల్‌లో వండిన భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. అన్నంలో సాంబార్‌లో పోయగా బల్లి ప్రత్యక్షం కావడంతో విద్యార్థినులు ఒ క్కసారిగా ఆందోళకు గురయ్యారు. వెంట నే హాస్టల్ వార్డెన్లు వచ్చి భోజనం చేసిన విద్యార్థినులను స్థానిక వైద్యుడికి చూపిం చారు.
విషప్రభావం కనిపించకపోవడం తో ఊపిరి పీల్చుకున్నారు. అయితే సాం బార్ తయారు చేసిన తర్వాత బల్లి పడడంతో విషప్రభావం చూపలేదని అంటున్నారు. ఈవిషయమై జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్ బాలునాయక్‌ను వివరణ కోరగా సాంబార్‌లో బల్లిపడిన మాట వాస్తవమేన ని, ముందే గుర్తించి పక్కకు పెట్టామన్నా రు. అప్పటికే ఇద్దరు విద్యార్థినులు భోజ నం చేయగా వారికి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించినట్లు తెలిపారు. ప్రమాదమేమీ లేదన్నారు.