సారా, విద్యావ్యాపారులు, సంచులు మోసేవారే!:రోజా | Liquor merchants and porters of bags along with Chandrababu Naidu! : Roja | Sakshi
Sakshi News home page

సారా, విద్యావ్యాపారులు, సంచులు మోసేవారే!:రోజా

Nov 27 2014 2:46 PM | Updated on Sep 2 2017 5:14 PM

రోజా

రోజా

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఆయన వెంట సారా వ్యాపారం, మనీ ల్యాండరింగ్, విద్యావ్యాపారం, సంచులు మోసేవారు తప్ప సంగతి తెలిసినవారు ఎవరూ లేరని వైఎస్ఆర్ సీపి ఎమ్మెల్యే రోజా విమర్శించారు.

విజయనగరం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఆయన వెంట సారా వ్యాపారం, మనీ ల్యాండరింగ్, విద్యావ్యాపారం, సంచులు మోసేవారు తప్ప సంగతి తెలిసినవారు ఎవరూ లేరని వైఎస్ఆర్ సీపి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని దౌర్భాగ్యస్థితిలో  చంద్రబాబు ఉన్నారని అన్నారు.

చంద్రబాబులా అబద్ధాలు చెబితే మొన్నటి ఎన్నికలలో వైఎస్ఆర్ సీపీకే అధికారం దక్కేదన్నారు. చంద్రబాబు మారారని ప్రజలు అనుకున్నారని, అయితే గతంలో కన్నా దారుణంగా, మోసగానిలా మారారన్న విషయం వారికి అర్ధమైపోయిందని చెప్పారు. చంద్రబాబు చేతకానితనం వల్లే రాష్ట్రం విడిపోవాలన్న ఆలోచన పుట్టుకొచ్చిందని రోజా అన్నారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement