స్నేహితుడిని విడిచి పెట్టి వస్తూ... | Leaving a friend to come to the ... | Sakshi
Sakshi News home page

స్నేహితుడిని విడిచి పెట్టి వస్తూ...

Mar 5 2016 1:40 AM | Updated on Sep 3 2017 7:00 PM

స్నేహితుడిని విడిచి పెట్టి వస్తూ...

స్నేహితుడిని విడిచి పెట్టి వస్తూ...

ట్రాక్టర్ ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థి మృతిచెందిన ఘటన మండలంలోని మల్లెంపూడి వద్ద శుక్రవారం చోటుచేసుకుంది.

ట్రాక్టర్ ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం
 
మంగళగిరిటౌన్:ట్రాక్టర్ ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థి మృతిచెందిన ఘటన మండలంలోని మల్లెంపూడి వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. తాడేపల్లి పోలీసుల కథనం మేరకు... ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ముప్పా వెంకట భవానీ శంకర్ (18)  తాడేపల్లి మండలం వడ్డేశ్వరం కేఎల్‌యూలో  బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తన స్నేహితుడిని బస్‌స్టాప్ వద్ద దించి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. శుక్రవారం కళాశాలలో తరగతులు ముగించుకుని తెనాలికి చెందిన తన స్నేహితుడు చైతన్యను తన ద్విచక్ర వాహనంపై రేవేంద్రపాడు బస్‌స్టాప్ వద్ద దించేందుకు బయలుదేరి వెళ్లారు.

అనంతరం అక్కడి నుంచి  భవానీ శంకర్ తిరిగి వస్తుండగా మార్గమధ్యలో మెల్లెంపూడి వద్దకు వచ్చే సరికి ఎదురుగా  వస్తున్న బ్రిక్స్ లోడు ట్రాక్టర్ ఢీకొట్టి భవానీ శంకర్ తలపైకి ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement