ప్రజా ప్రతినిధుల అండతోనే భూదందా | Land scams with public representatives | Sakshi
Sakshi News home page

ప్రజా ప్రతినిధుల అండతోనే భూదందా

Jun 3 2017 1:19 AM | Updated on Sep 5 2017 12:40 PM

ప్రజా ప్రతినిధుల అండతోనే భూదందా

ప్రజా ప్రతినిధుల అండతోనే భూదందా

ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల అండదండలతోనే విశాఖలో భూ దందా యథేచ్ఛగా కొనసాగుతోందని రాష్ట్ర ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.

- మంత్రి అయ్యన్నపాత్రుడు 
నా స్నేహితుడూ భూమిని ఆక్రమించుకుంటానన్నాడు
 
సాక్షి, విశాఖపట్నం: ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల అండదండలతోనే విశాఖలో భూ దందా యథేచ్ఛగా కొనసాగుతోందని రాష్ట్ర ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ప్రవాసాం ధ్రులు ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ముతో విశాఖలో భూములు కొనుగోలు చేస్తే.. భూ బకాసురులు వాటిని ఆక్రమిం చుకుంటూ వారిని ముప్పుతిప్పలు పెడుతు న్నారని చెప్పారు. ‘విశాఖలో భూ దందా సాగుతోందంట కదా? రాజకీయ అండదం డలుంటే ఎక్కడైనా సరే, ప్రభుత్వ భూములైనా దర్జాగా కబ్జా చేయొచ్చట కదా.. మీరు కాస్త మద్దతుగా ఉంటే నేనో రెండెకరాలు ఆక్రమించుకుంటానంటూ ఓ స్నేహితుడు నన్నడిగాడు.

ఆయన మాటలు వింటుంటే విశాఖలో భూములు ఎంత ఈజీగా కబ్జా చేయొచ్చో అర్ధమవుతోంది’ అని అయ్యన్న అన్నారు. విశాఖ వుడా చిల్డ్రన్స్‌ థియేటర్‌లో శుక్రవారం జరిగిన నవనిర్మాణ దీక్ష సభలో ఆయన మాట్లాడారు.  ఆర్‌ అండ్‌ బీ సీఈ గంగాధర్‌ రూ.150 కోట్ల అక్రమాస్తులతో ఏసీబీకి దొరికిపోయారని, ఒక సీఈకి ఇంత సంపాదన అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. భూదందాను బట్టబయలు చేసిన కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్, జేసీ సృజన, పోలీస్‌ కమిషనర్‌ యోగానంద్‌లను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement