భక్తులతో నిండిపోయిన కదిరి | Lakshmi Narasimha Brahmotsavam in anantapur district | Sakshi
Sakshi News home page

భక్తులతో నిండిపోయిన కదిరి

Mar 28 2016 12:02 PM | Updated on Sep 3 2017 8:44 PM

అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం తుది అంకానికి చేరుకున్నాయి.

కదిరి: అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం తుది అంకానికి చేరుకున్నాయి. అత్యంత కీలకమైన రథోత్సవం అసంఖ్యాక భక్త జనం నడుమ ఉదయం ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే చాంద్‌బాషా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు పడమర గోపురం వద్దకు స్వామివారి రథం చేరుకుంది. ఆలయ తిరువీధులలో స్వామి వారి రథం ఒక్కమారు ఊరేగనుంది. రథోత్సవాన్ని చూసేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి సుమారు 3 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. పట్టణ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి కూడా రథోత్సవంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement