'సీఎంను మార్చే అవకాశం లేదు' | Lagadapati Rajagopal meets Kiran kumar Reddy | Sakshi
Sakshi News home page

'సీఎంను మార్చే అవకాశం లేదు'

Feb 8 2014 9:16 PM | Updated on Jul 29 2019 5:31 PM

'సీఎంను మార్చే అవకాశం లేదు' - Sakshi

'సీఎంను మార్చే అవకాశం లేదు'

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఇప్పట్లో మార్చే అవకాశం లేదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఇప్పట్లో మార్చే అవకాశం లేదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. క్యాంప్ ఆఫీసులో శనివారం సాయంత్రం ఆయన సీఎంను కలిశారు.

కిరణ్ కుమార్ రెడ్డిని మార్చే అవకాశం ఉంటే ఆరు నెలల క్రితమే మార్చే వారని లగడపాటి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం మార్చులు చేయకపోవచ్చని అభిప్రాయపడ్డారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ ముందుకు రావడం కష్టమేనని చెప్పారు. పార్లమెంట్కు రాకుండా అడ్డుకుంటామని లగడపాటి అన్నారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును యధాతథంగా పార్లమెంట్లో ప్రవేశపెడితే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని కిరణ్ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. కాగా బిల్లులో సవరణలు చేయకుండా కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో లగడపాటి పైవిధంగా స్పందించారు.

Advertisement
 
Advertisement
Advertisement