
సాక్షి, కర్నూలు: ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరిపేందుకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 19న నోటిఫికేషన్ జారీ చేయనుంది. జనవరి 12న పోలింగ్, 16న కౌంటింగ్ జరపాలని నిర్ణయించింది. కాగా, శిల్పా చక్రపాణిరెడ్డి వైఎస్సార్‌సీపీలోకి మారడంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సూచన మేరకు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది.