'సీఎం సంతకాలతో రూ.40 కోట్లకు పైగా ముడుపులు' | komatireddy venkatareddy takes a dig at kiran kumar reddy | Sakshi
Sakshi News home page

'సీఎం సంతకాలతో రూ.40 కోట్లకు పైగా ముడుపులు'

Feb 15 2014 2:20 PM | Updated on Jul 29 2019 5:31 PM

'సీఎం సంతకాలతో రూ.40 కోట్లకు పైగా ముడుపులు' - Sakshi

'సీఎం సంతకాలతో రూ.40 కోట్లకు పైగా ముడుపులు'

ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముడుపులు పుచ్చుకునేందుకు, ఫైళ్లపై సంతకాలు చేసేందుకే కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ నెలలో కిరణ్ సంతకాల వల్ల రూ.40 కోట్లకు పైగా ముడుపులు ముట్టాయని కోమటిరెడ్డి ఆరోపించారు.

రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందకుండా ఆగిపోతే... జరిగే పరిణామాలకు సీమాంధ్ర ముఖ్య నేతలే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కోటిమంది తెలంగాణ వాదులు హైదరాబాద్కు వస్తే ఏమి జరుగుతుందో సీమాంధ్ర ఎమ్మెల్యేలే నిర్ణయించుకోవాలని కోమటిరెడ్డి అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement